పదేళ్ళ క్రితం ప్రారంభమైన తెలుగు వికీపీడియాలో దాదాపు ఎనిమిది మాసాల పాటు ఒకే ఒక్క వ్యాసాన్ని కలిగియుంది. ఆ తర్వాత మెల్లగా వ్యాసాలసంఖ్య వృద్ధి చెందుతూ ఒక సంవత్సరం పూర్తయ్యే నాటికి (12/2004) వ్యాసాల సంఖ్య 43కు చేరింది. ఆ తర్వాత వ్యాసాల వృద్ధి వేగంగా పెరిగి రెండో ఏడాది ముగిసే నాటికి (12/2005) 1700 వరకు చేరింది. చావాకిరణ్, వీవెన్, వేమూరి, వైజాసత్య, చదువరి, ప్రదీప్, త్రివిక్రంల చేరికతో వ్యాసాల సంఖ్యలో కదలిక వచ్చి విశేష పురోభివృద్ధి కనిపించింది. మూడో ఏడాదిలో గ్రామవ్యాసాలను సృష్టించడంతో 12/2006 నాటికి వ్యాసాల సంఖ్య 26వేలకు చేరింది. కాసుబాబు, సుజాత, రహమతుల్లా, చిట్టెల, నవీన్‌ల చేరిక ఇదే కాలంలో జరిగింది. రాజశేఖర్, అహ్మద్ నిసార్, రవిచంద్ర, అర్జునరావు, మాటలబాబు, దేవా, విశ్వనాథ్, చంద్రకాంతరావుల చేరికతో 12/2007 నాటికి 38వేలు, 12/2008 నాటికి 42 వేలకు చేరింది. 2/2008లో ఈనాడు దినపత్రిక ఆదివారం అనుబంధంలో కవర్ స్టోరి రావడంతో ఈ కాలంలో వేలాది కొత్త సభ్యులు చేరారు. 12/2009 నాటికి 44వేలకు చేరగా ఈ కాలంలో కొత్తగా చేరిన వారిలో సుల్తాన్ ఖాదర్, వీరా ముఖ్యులు. 12/2010 నాటికి 47 వేలకు చేరింది ఈ కాలంలోనే జెవిఆర్‌కె ప్రసాద్ చేరారు. 12/2011 నాటికి 50వేలకు చేరింది. 12/2012 నాటికి కొంత మాత్రమే మెరుగై వ్యాసాల సంఖ్య 51వేలకు చేరింది. ఈ కాలంలో భాస్కరనాయుడు, వైవిఎస్ రెడ్డి, పాలగిరి, రహ్మానుద్దీన్, శ్రీధర్, వెంకటరమణ, శ్రీరామమూర్తి సభ్యులు నూతనంగా తెవికీలో ప్రవేశించారు. వీరందరి కృషి ఫలితంగా నేటికి (11/2013) సుమారు 53800 వ్యాసాలున్నాయి. ఒకప్పుడు దేశభాషా వికీలలో అత్యధిక వ్యాసాలు కలిగిన తెవికీని తదనంతరం హిందీ, తమిళ వికీలు అధికమించాయి. మళ్ళీ మనం ఆ స్థానాన్ని పొందడం కొంత కష్టమే కాని సభ్యులు ప్రయత్నిస్తే అసంభవం మాత్రం కాదు.
ఎవరెన్ని సృష్టించారు?
వ్యాసాలను సృష్టించడంలో బాటులే అగ్రస్థానంలో ఉన్నాయి. వైజాసత్యగారి Vyzbot ద్వారా 24 వేల వ్యాసాలు, ప్రదీప్ గారి Mpradeepbot ద్వారా 5700 వ్యాసాలు సృష్టించబడ్డాయి. అంటే తెవికీలోని మొత్తం వ్యాసాలలో సగభాగం కంటే అధికంగా ఈ రెండు బాటులు సృష్టించిన వ్యాసాలే అన్నమాట.
ఏ వ్యాసాలు ఎన్ని?
తెవికీ వ్యాసాలలో అగ్రస్థానం గ్రామవ్యాసాలే అనే సంగతి అందరికీ తెలుసు. దాదాపున్ 26 వేల గ్రామవ్యాసాలు తెవికీలో ఉన్నాయి. వీటిలో అధికశాతం ఏకవాక్య వ్యాసాలే. అయితే ఇటీవలి కాలంలో గ్రామవ్యాసాలలో కూడా సమాచారం చేరుతోంది. గ్రామవ్యాసాల తర్వాత రెండోస్థానం సినిమా వ్యాసాలది. ఇవి 5-6 వేల సంఖ్యలో ఉండవచ్చు. కేలండర్ వ్యాసాలు (సంవత్సరాలు, తేదీలు), వ్యక్తుల వ్యాసాలు, దేశాలు, నియోజకవర్గాలు, శాస్త్ర-సాంకేతికాల వ్యాసాలు కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నాయి.

No comments:
Post a Comment