తెలుగు వికీకోట్ |
వికీపీడీయా పేరు అందరికీ సుపరిచితమే. అది ఒక ఉచిత విజ్ఞాన సర్వస్వపు భాండాగారమని కూడా అందరికీ తెలుసు. వికీపీడియాకు అనుబంధంగా ఎన్నో ప్రాజెక్టులున్నాయి. అందులో ఒకటి వికీకోట్. ఇందులో తొలిసగం పేరు వికీ అంటే ఎవరైనా ఉపయోగించుకొనే అర్థాన్ని సూచిస్తే, మలి సగం పేరు కొటేషన్లను సూచిస్తుంది. అంటే ఇది ఉచిత కొటేషన్ల భాండాగారమని అర్థం చేసుకోవచ్చు. ("ఉచిత సలహా" మాదిరిగా అర్థం చేసుకోకండి). వికీపీడియాలో ఉన్నట్లుగా ఇందులోనూ ప్రతిపేజీలో లింకులు, బయటి లింకులు, మూసలు, అంతర్వికీలు ఉంటాయి. అయితే ఇది కేవలం 56 భాషలలోనే నిర్వహించబడుతున్నది. మరికొన్ని భాషల వికీకోట్‌లు అచేతనంగా ఉండుటచే మూసివేశారు.
వీక్షకుల ప్రకారం చూస్తే అన్ని వికీ ప్రాజెక్టుల మాదిరిగానే ఇందులోనూ ఆంగ్లభాషదే అగ్రస్థానం. ఆ తర్వాతి స్థానాలను ఇటాలియన్, స్పానిష్, రష్యన్ భాషలు ఆక్రమిస్తున్నాయి. అయితే పేజీల సంఖ్యలో మాత్రం పోలిష్ భాష ఆంగ్ల భాషను అధికమించడం విశేషం.తెలుగుభాషలో నేటికి 288 పేజీలతో భారతీయ భాషలలో మలయాళం తర్వాత రెండో స్థానంలో ఉంది.
తెవికోట్‌లో ఏమివ్రాయవచ్చు?
తెలుగు వికీకోట్‌లో ప్రముఖుల వ్యాఖ్యలు (కొటేషన్లు), సామెతలు వ్రాయడమే కాకుండా కొందరు ఇదివరకు సినిమా డైలాగులు, పాటలు కూడా వ్రాశారు. ఇది ఇంకనూ ప్రారంభదశలోనే ఉన్నందున పెద్దగా నియమాలు కూడా లేవు. ఒకరిద్దరు మినహా ఇందులో చురుకైన సభ్యులు లేరు. మీకు కొటేషన్లపై ఆసక్తి ఉండి ఇందులో పనిచేయాలంటే ఇప్పుడే తెవికోట్‌లో చేరి రచనలు ప్రారంభించండి.
తెవికోట్ అడ్రస్: https://te.wikiquote.org/

No comments:
Post a Comment