Saturday, 7 December 2013

తెలుగు వికీపీడియాలో "తెలంగాణ పోర్టల్" ప్రారంభం

తెలుగు వికీపీడియాలో "తెలంగాణ పోర్టల్" (వేదిక:తెలంగాణ) ప్రారంభించబడింది. ఈ వేదిక ద్వారా ప్రతి వారం తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక వ్యాసం, ఒక చిత్రాన్ని కాకుండా వింతలు-విశేషాలు పొందుపర్చబడతాయి. అంతేకాదు ఈ వేదికలో ఉన్న లింకుల ద్వారా తెలంగాణ మొత్తం చుట్టేయవచ్చు. ఇదివరకు తెవికీలో 7 వేదికలుండగా డిసెంబరు 6, 2013న తెలంగాణ పోర్టల్ 8వ వేదికగా అవతరించింది. తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన కొత్త వ్యాసాలు వ్రాయడానికి, ఉన్న వ్యాసాలలో సమాచారం చేర్చడానికి మీకూ అవకాశం ఉంది. మీ గ్రామం గురించి, మీ మండలం గురించి, మీ జిల్లా గురించి, ఇలా మీకు తెలిసిన ఏ ప్రాంతం గురించి అయినా, ఏ వ్యక్తి గురించి అయినా సమాచారం చేర్చడానికి తెలుగు వికీపీడియాలో చేరండి, రచనలు కొనసాగించండి.

No comments:

Post a Comment