పేజీకి అనుబంధంగా ఉండే పేజీలనే ఉపపేజీలంటారు. ఆ పేజీలు సభ్యుల వాడుకరి పేజీలు కావచ్చు, చర్చాపేజీలు కావచ్చు, వ్యాసం పేజీలుకావచ్చు. అయితే ఈ ఉపపేజీల యొక్క అవసరం ఏమిటి? వాటిని ఎలా సృష్టించాలి? దిద్దుబాట్లలో ఆపేజీలపై ఉన్న పరిమితులేమిటి? తదితర విషయాలను తెలుసుకుందాం.
ఉపపేజీలు సృష్టించుట:
ఉప-పేజీలనేవి పేజీకి అనుబంధంగానే ఉంటాయి కాబట్టి ప్రధానపేజీ పేరు తర్వాత స్లాష్ (/) ఇచ్చి తర్వాత ఏదేని పేరు వ్రాసి వ్యాసం సృష్టించే తరహాలోనే దీన్ని కూడా సృష్టించవచ్చు. ఉదా:కు xyz అనే సభ్యుడు తన వాడుకరి పేజీ (సభ్యపేజీ)కి అనుబంధంగా ప్రయోగాలు చేయడానికి ఒక ప్రయోగశాలను ఏర్పాటుచేసుకోదలిస్తే "వాడుకరి:xyz/ప్రయోగశాల" పేరుతో పేజీ సృష్టిస్తే అది ఆ వాడుకరి పేజీ యొక్క ఉప పేజీ అవుతుంది.
ఉపపేజీల అవసరం ఏమిటి?
ఉపపేజీలు సృష్టించుట:
ఉప-పేజీలనేవి పేజీకి అనుబంధంగానే ఉంటాయి కాబట్టి ప్రధానపేజీ పేరు తర్వాత స్లాష్ (/) ఇచ్చి తర్వాత ఏదేని పేరు వ్రాసి వ్యాసం సృష్టించే తరహాలోనే దీన్ని కూడా సృష్టించవచ్చు. ఉదా:కు xyz అనే సభ్యుడు తన వాడుకరి పేజీ (సభ్యపేజీ)కి అనుబంధంగా ప్రయోగాలు చేయడానికి ఒక ప్రయోగశాలను ఏర్పాటుచేసుకోదలిస్తే "వాడుకరి:xyz/ప్రయోగశాల" పేరుతో పేజీ సృష్టిస్తే అది ఆ వాడుకరి పేజీ యొక్క ఉప పేజీ అవుతుంది.
ఉపపేజీల అవసరం ఏమిటి?
- తెవికీలో ప్రయోగశాల ఉంది కదా! మరి ప్రత్యేకంగా ఒక సభ్యునికి ప్రయోగశాల ఎందుకనే అనుమానం రావచ్చు. కాని తెవికీ ప్రయోగశాలలో ఎవరైనా ప్రయోగాలు చేయవచ్చు. ఒకరి కంటె అధికంగా ఒకే సారి ప్రయోగాలు చేస్తున్నప్పుడు ఒకరి ప్రయోగం మరొకరికి ఆటంకం కలుగుతుంది. ఈ ఉద్దేశ్యంతోనే చాలా సభ్యులు తమ సభ్యపేజీలకు అనుబంధంగా ఉపపేజీలను సృష్టించి ప్రయోగశాలగా వాడుకుంటారు.
- తమ సభ్యపేజీకి అనుబంధంగా ఏదేని వ్రాయదల్చుకుంటే దానికై కూడాఉపపేజీలు సృష్టించుకోవచ్చు.
- రచ్చబండలలో తరుచుగా చర్చలు జరుగుతూంటాయి కాబటి ఆ పేజీ చాలాపొడవు అవుతుంది. కొంతకాలం తర్వాత పాతచర్చలు ఉపపేజీలకు తరలిస్తారు. ఈరోజు నాటికి (18-11-2013) రచ్చబండకే 25 ఉపపేజీలున్నాయి చూడండి.
- వ్యాసం లేదా సభ్యుల చర్చాపేజీలలో కూడా చర్చలు ఎక్కువై ఆపేజీ పొడవు పెరిగినప్పుడు వాటిని కూడా ఉపపేజీలకు తరలించవచ్చు.
- కొందరు సభ్యులు కొత్త వ్యాసం ప్రారంభించేటప్పుడు ఇతర సభ్యులు ఆ వ్యాసంలో తాత్కాలికంగా జోక్యం చేసుకోరాదని తమ సభ్యపేజీకి అనుబంధంగా ఉపపేజీలు ప్రారంభిస్తారు.
- వికీ ప్రాజెక్టులకు అనుబంధంగా కూడా ఉపపేజీలు సృష్టించబడతాయి.
ఉపపేజీలను ఎలా తొలగించాలి?
వ్యాసాన్ని తొలిగించినట్లే ఉప పేజీలకు కూడా తొలగించవచ్చు. ప్రయోగశాల వంటివి భవిషత్తులోకూడా ఉపయోగపడతాయి కాబట్టి వీటిని అలాగే ఉంచుకోవడం మంచిది. కొత్త వ్యాసం కొరకు సృష్టించిన ఉపపేజీలలో సమాచారం ఒకస్థాయికి వచ్చిన పిదప కాపీపేస్ట్ చేయడం కంటె తరలించడం సరైనపని. కాపీపేస్టే చేయడం వల్ల కూర్పుల చరితం వ్యాసంలోకి చేరదు. కాబట్టి తరలించి దారిమార్పుగా ఏర్పడిన ఉపపేజీలో మళ్ళీ పనులు సాగించవచ్చు.
ఉపపేజీలకు లింకులు ఎలా ఇవ్వాలి?
ఉపపేజీలకు లింకులివ్వడానికి మొత్తం పేరుతోనే కాకుండా మరో చిన్నదారికూడాఉంది. అదే స్లాష్ (/) తర్వాత ఆ ఉపపేజీ ఇస్తే సరిపోతుంది. (ఉదా:కు వాడుకరి:abc సభ్యపేజీకి ఉపపేజీ అయిన ప్రయోగశాల లింకుకై [[[/ప్రయోగశాల]] అనిమాత్రం ఇస్తే సరిపోతుంది) అయితే ఈ సదుపాయం ఆ ప్రధాన పేజీకే పరిమితం. ఇతర పేజీలలో మాత్రం మొత్తం పేరుతోనే లింకులివ్వాల్సి ఉంటుంది.
ఉపపేజీలపై పరిమితులు:
- ఉపపేజీలలో కూడా తెవికీ నిబంధనలకు విరుద్ధమైన పనులు చేయరాదు.
- ఒకే పేజీకి మితిమీరి ఉప పేజీలు సృష్టించకండి.
- వ్యాసాలకు ఉపపేజీలు సృష్టించకండి, మరో ప్రత్యేక వ్యాసాన్నే తయారుచేయండి. ఉదా:కు "xyz" నటుడి పేజి ఉందనుకుందాం, ఆ నటుకి సంబంధించిన సినిమా పేర్లతో (అధికంగా ఉంటేనే) మరో వ్యాసాన్ని ("xyz నటించిన సినిమాలు") తయారుచేయండి కాని "xyz/సినిమాలు" అని ఉపపేజీ పెట్టకండి.
- ఒకరు సృష్టించుకున్న ఉపపేజీలలో మరొకరు సాధారణంగా జోక్యం చేసుకోకపోవడం మంచిది. అందులోని విషయంపై ఏదేని చెప్పదలిస్తే ఆ సభ్యుని చర్చాపేజీలో తెలపండి.
- ఉపపేజీలకు కూడా ఉపపేజీలు సృష్టించవచ్చు, కాని అలా ఉప-ఉప-ఉపపేజీలు సృష్టించి గందరగోళం చేయకండి.
- రచ్చబండ ఉపపేజీలైనా, చర్చాపేజీ ఉపపేజీలైనా అవి పాత చర్చలకు సంబంధించినవి కాబట్టి అందులో మార్పు చేయకండి.అవసరమైతే అదే విషయంపై మరో కొత్త చర్చ తీయండి.
No comments:
Post a Comment