2013 సంవత్సరంలో తెవికీకి మొత్తంపై 28.3 మిలియన్ల హిట్లు నమోదైనాయి. తమిళ వికీతో పోలిస్తే ఇది 42% మాత్రమే. 28.8 మిలియన్లు హిట్లు జరిగిన 2012 సం.తో పోల్చిననూ ఇది కొంత తక్కువే. జూలై మాసంలో గరిష్టంగా 2.9 మిలియన్ల హిట్లు జరిగాయి. తమిళ వికీలో ఒక మాసంలో జరిగిన కనిష్ట హిట్లు (4.2) కంటే ఇది తక్కువగా ఉంది. తెవికీ చరిత్రలోనే గరిష్ట హిట్లు (4.5) నమోదైన మాసం ఫిబ్రవరి 2010 కంటే తమిళ వికీలో ప్రతిమాసపు ఎక్కువే ఉంది. 2013లో హిందీ వికీ సరాసరి వీక్షణలు 9.2మి.గా ఉంది. మలయాళం వికీ సరాసరి కూడా మనకంటే అధికంగానే (3.9) ఉంది. మన వీక్షణలు పెరగాలంటే వ్యాసాలలో నాణ్యత పెరగడమే కాకుండా పాఠకులు ఎలాంటి వ్యాసాలకై సందర్శిస్తున్నారో పరిశీలించి అలాంటి వ్యాసాలపై కృషిచేయవలసి ఉంటుంది.
|
Thursday, 2 January 2014
2013లో తెవికీకి ఎందరు చూశారు?
Subscribe to:
Post Comments (Atom)
కరెక్ట్ గా చెప్పారు. నాణ్యత పెరగడం, రచయితల సంఖ్య పెరగడం, అన్ని విభాగాల్లోనూ చెప్పుకోదగిన వ్యాసాల సంఖ్య ఉండడం ముఖ్యం.ఈ సంవత్సరం నేను కూడా కొన్ని వ్యాసాలను జతపర్చే ఆలోచనలో ఉన్నాను.
ReplyDeleteఅలాగే చేయండి, చాలా సంతోషం.
Delete