గత 4 మాసాల తెలుగు వికీపీడియా వ్యాసపు దిద్దుబాట్ల ప్రగతిని పరిశీలిస్తే క్రమక్రమంగా దిద్దుబాట్లు పెరుగుతున్నట్లు కనిపిస్తుంది. సెప్టెంబరు 2006 మాసములో జరిగిన్ ఆల్‌టైం తెవికీ రికార్డు ఇప్పటి సంఖ్యలు దూరంలోనే ఉన్ననూ చాలాకాలం పాటు 5-10 వేలమధ్యలో ఊగిసలాడుతున్న దిద్దుబాట్ల సంఖ్య (మార్చి2013లో మినహా) సెప్టెంబరు నుంచి 12-13 వేలకు చేరింది. ఈ దిద్దుబాట్ల సంఖ్యలో అధికంగా చిన్న దిద్దుబాట్లే ఉన్ననూ, అవి వ్యాస సమాచారానికి పెద్దగా ఉపకరించకపోయిననూ గణాంకాల పరంగా మాత్రం దిద్దుబాట్లు పెరిగినట్లే చెప్పుకోవచ్చు.
దిద్దుబాట్లు ఎవరు చేశారు?
సెప్టెంబరు నుంచి 12వేలకు పైగా దిద్దుబాట్లు జరుగుతున్ననూ అందులో ఒకే సభ్యుని దిద్దుబాట్లు 2500+ ఉన్నాయి. మరో ఇద్దరి (సెప్టెంబరులో ముగ్గురి) దిద్దుబాట్లు 1000+ ఉన్నాయి. అంటే దాదాపు సగభాగం వ్యాసపు దిద్దుబాట్లు ముగ్గురు సభ్యులతోనే జరుగుతుందన్నమాట. మాసాల వారీగా విశ్లేషించిన గత పోస్టులలో కూడా ఇద్దరు ముగ్గురు సభ్యులదే సగభాగంపైగా దిద్దుబాట్లు ఉన్నట్లుగా చూపబడినది.
దిద్దుబాట్లు దేనిపై జరుగుతున్నాయి? అత్యధిక దిద్దుబాట్లు చేసిన సభ్యులు వ్యాసంలో చిన్నచిన్న మార్పులే చేశారు. ఒక సభ్యుడు పిన్‌కోడ్ లను గ్రామవ్యాసాలలో పెట్టగా, మరో సభ్యుడు గ్రామ వ్యాసాలలో జనాభా వివరాలు పెట్టారు. జనవరిలో కూడా బాటుచేసే మార్పులే సభ్యులు చేస్తూ గ్రామవ్యాసాలలొ ఇన్ఫోబాక్సు పెడుతున్నారు. సభ్యులు ఇలాంటి దిద్దుబాట్లు కాకుండా వ్యాసంలో నాణ్యమైన సమాచారాన్ని చేర్చడానికి కృషిచేయడానికి ప్రయత్నించడం మంచిది. |
Monday, 20 January 2014
తెవికీలో పెరుగుతున్న దిద్దుబాట్ల సంఖ్య
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment