డిసెంబరు 2013 మాసపు తెవికీ గణాంకాలు పరిశీలిస్తే తెవికీ చరిత్రలోనే రికార్డు స్థాయిలో దిద్దుబాట్లు జరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా 100కు పైగా దిద్దుబాట్లు చేసిన సభ్యుల సంఖ్య ఈ మాసంలో 20గా నమోదైంది. గత రికార్డు అయిన ఫిబ్రబరి 2008 మాసపు 16 సంఖ్య కంటె ఇది 25% అధికం. కొత్త సభ్యుల సంఖ్య (5+ దిద్దుబాట్లు చేసిన వారు) ఈ మాసంలో 28 గురు కొత్తగా చేరారు. ఫిబ్రవరి 2008 నాటి 45తర్వాత ఇది రెండో అత్యధికం. 5+ దిద్దుబాట్లు చేసిన సభ్యుల సంఖ్యలో కూడా ఫిబ్రవరి 2008 మాసపు 102 తర్వాత ఇది రెండో అత్యధికం.
అలాగే మొత్తం దిద్దుబాట్ల సంఖ్యలో చూస్తే సుమారు 18వేల దిద్దుబాట్లు ఈ మాసంలో జరిగినట్లు తెలుస్తుంది. గత కొన్ని మాసాలలో పోల్చి చూస్తే ఈ సంఖ్య గణనీయంగ పెరినట్లు చెప్పవచ్చు. జనవరి 2008 మాసపు 32వేల దిద్దుబాట్ల తర్వాత సెప్టెంబరు 2006 మాసముతో కలిపి ఈ మాసం సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచినట్లయింది. వ్యాసాల సంఖ్యలో కూడా రోజుకు సరాసరిన 24 కొత్త వ్యాసాలు చేర్చబడి మొత్తం వ్యాసాలు 55 వేల మార్కుకు చేరింది. సెప్టెంబరు 2007 తర్వాత రోజు సరాసరిన పాతిక వ్యాసాలు తెవికీ రావడం ఇదే ప్రథమం.
వ్యాసాపు పేజీలలో 250+ దిద్దుబాట్ల గణాంకాలు
సభ్యుల వారీగా దిద్దుబాట్లు పరిశీలిస్తే 2500 దిద్దుబాట్లలో ఈ మాసం కూడా వరసగా ఒక సంఖ్య నమోదైంది. 11 సభ్యులు 250+ దిద్దుబాట్లు చేయడం, 27 సభ్యులు 25+ దిద్దుబాట్లు చేయడం కూడా తెవికీ చరిత్రలోనే రికార్డుగా చెప్పవచ్చు. సభ్యుడు YVSREDDY చేసిన 4,984 దిద్దుబాట్ల సంఖ్య మరో తెవికీ రికార్డునే సృష్టించింది. గతంలో తాను చేసిన రికార్డునే మరోసారి అధికమించడం జరిగింది. అంతేకాకుండా ఒకే సారి 3 స్థానాలు ఎగబాకి తెవికీలో అత్యధిక వ్యాసపు దిద్దుబాట్లు చేసినవారిలో రెండోస్థానంలో నిలిచారు. |
Thursday, 23 January 2014
డిసెంబరు 2013 మాసపు తెవికీ గణాంకాలు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment