పదేళ్ళ తెవికీ చరిత్రను గమనిస్తే వ్యాసాల సంఖ్యలో ఒక దశలో భారతీయ భాషలలో ప్రథమ స్థానంలో ఉన్న తెలుగు వికీపీడియా ప్రస్తుతం మూడవ స్థానానికి పడిపోయింది. ఆగస్టు 2009 వరకు తొలి స్థానంలో ఉండగా సెప్టెంబరు 2009లో హిందీ వికీ ఆస్థానాన్ని చేజిక్కించుకుంది. ఏప్రిల్ 2013లో తమిళ వికీ కూడా వ్యాసాల సంఖ్యలో తెవికీని మరోస్థానం దిగజార్చి మనల్ని మూడో స్థానానికి చేర్చింది.
తెవికీలో వ్యాసాల వృద్ధి పరిణామం:
తెవికీ 12/2003లో ప్రారంభంకాగా 12/2004 వరకు కేవలం 43 వ్యాసాలే నమొదయ్యాయి. 12/2005 నాటికి వ్యాసాల సంఖ్య 1700కు చేరగా, 12/2006 నాటికి 26000 వ్యాసాలతో భారతీయ భాషలలో ఎవరికీ అందనంతగా పై స్థానంలో ఉండేది. అప్పటికీ హిందీవికీలో వ్యాసాలు కేవలం 4300 మాత్రమే. తెవికీలో కూడా ఆ ఏడాది వ్యాసాలు అంతగా వృద్ధి కావడానికి కారణం బాటుద్వారా గ్రామాల వ్యాసాలను చేర్చడమే. తర్వాత ఇదే పద్దతి హిందీ, తమిళ వికీలు అనుసరించడంతో ఆభాషలలో వ్యాసాల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోయింది. 12/2007 నాటికి తెవికీ వ్యాసాలు 38000, 12/2008 నాటికి 42000లతో తొలి స్థానంలో ఉండగా, 12/2009 నాటికి 44000 వ్యాసాలతో రెండో స్థానంలో ఉంది. 12/2010 నాటికి 47000 వ్యాసాలు, 12/2011 నాటికి 50000 వ్యాసాలు, 12/2012 నాటికి 51000 వ్యాసాలు ఉండగా, 12/2013 నాటికి తమిళ వికీ కూడా తెవికీని అధికమించింది.
|
Wednesday, 25 December 2013
వ్యాసాల సంఖ్యలో తెవికీ స్థానం
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment