వికీపీడియాలో సభ్యత్వం పొందిన వారందరికీ ఒక సభ్యపేజీ కేటాయించబడుతుంది. సభ్యపేజీకి అనుబంధంగా చర్చాపేజీ కూడా ఉంటుంది. తోటి సభ్యులు మనల్ని సంప్రదించడానికి లేదా మనకు ఏదేని విషయం చెప్పడానికి చర్చాపేజీ ఉపయోగపడితే సభ్యపేజీలో మన యొక్క సంక్షిప్త పరిచయం తోటి సభ్యులకు తెలియజేయడానికి ఉపయోగపడుతుంది. మన అసలుపేరు (సభ్యనామం అసలునామం ఉండనప్పుడు), మన ప్రాంతం, మన విద్యాభ్యాసం, మన హోదా తదితర వ్యక్తిగత విసయాలే కాకుండా తెవికీకి సంబంధించి మనం చేసిన, చేస్తున్న, చేయబోయే పనుల గురించి కూడా వ్రాసుకోవచ్చు. దీని గురించి వివరంగా తెలుసుకుందాం.
సభ్యపేజీలో ఏమి వ్రాసుకోవచ్చు:
సభ్యపేజీలో ఏమి వ్రాసుకోవచ్చు:
- మీ వ్యక్తిగత వివరాలు అనగా అసలునామం ఏమిటి, మీరు ఎక్కడివారు, మీ విద్యాస్థాయి, మీ ఈ-మెయిల్, మీరు చేస్తున్న వృత్తి, మీ అభిరుచులు-ఆసక్తులు లాంటివి వ్రాసుకోవచ్చు.
- మీ ఫోటో లేదా మీ అభిమాని ఫోటో పెట్టుకోవచ్చు కాని ఇవి లైసెన్సుకు అనుగుణంగా ఉండాలి.
- కొతకాలం సెలవులో వెళ్లదలిస్తే ఆ విషయం సభ్యపేజీలో వ్రాసుకోవచ్చు.
- మీరు తరుచుగావాడే లింకులు,మూసలు తదితరాలు కూడా సభ్యపేజీలో ఉంచుకోవచ్చు.
- తోటి సభ్యులు బహుకరించిన పతకాలు, వ్యాఖ్యలు ఉంచుకోవచ్చు.
- మీరు పనిచేసే ప్రాజెక్టు మూసలు ఉంచుకోవచ్చు.
- సభ్యపేజీకి అనుబంధంగా ఉపపేజీలు ప్రారంభించి మీ ప్రయోగాలు చేసుకోవచ్చు.
సభ్యపేజీ - పరిమితులు:
- సభ్యపేజీలో ప్రకటనలు ఉంచుకోరాదు.
- వికీపీడియాకు సంబంధం లేని ఇతర విషయాలు వ్రాయరాదు.
- తోటి సభ్యులకు ఇబ్బంది కలిగించే వ్యాఖ్యలు వ్రాయరాదు.
- మితిమీరిన వ్యక్తిగత సమాచారం చేర్చరాదు.
- వ్యక్తిగత బ్లాగుల లింకులు ఉంచరాదు, (ఈ మధ్య చాలా సభ్యులు బ్లాగులింకులు ఇస్తున్నారు. అయితే తెవికీకి సంబంధించిన లేదా తెవికీ వలె విజ్ఞానానికి సంబంధించిన బ్లాగులైతే ఫర్వాలేదు కాని ఇతర బ్లాగులైతే ఆలోచించండి).
సభ్యపేజీలలో ఎవరైనా దిద్దుబాట్లు చేయవచ్చా?
సాధ్యమైనంత వరకు ఇతరుల సభ్యపేజీలలో దిద్దుబాట్లు చేయకపోవడం ఉత్తమం. ఆ సభ్యపేజీ గురించి చెప్పాలంటే చర్చాపేజీలో వ్రాయండి. పతకాలు అందించాలన్ననూ ఆ సభ్యుడి చర్చాపేజీలోనే చేర్చండి.
సభ్యపేజీలు తొలగించవచ్చా?
సభ్యుడు కోరితే తప్ప సభ్యపేజీలు తొలగించరాదు. ఒకసభ్యుడు ఇక ముందు తెవికీలో రచనలు చేయక విరమణ ప్రకటించి మునుముందు దుశ్చర్యకు గురౌతుందని భావించి స్వచ్ఛందంగా సభ్యపేజీని తొలగించమని కోరితే ఎవరైనా నిర్వాహకులు తొలగిస్తారు.
సభ్యపేజీకి తాళం:
తరుచుగా దుశ్చర్యలకు గురయ్యే సభ్యపేజీకి సంరక్షణ విధించుకొనే అవకాశం ఉంది. నిర్వాహకులు కానివారైతే ఎవరైనా నిర్వాహకులను సంప్రదించి తమ సభ్యపేజి రక్షణ కొరకు సంరక్షణ కల్పించమని కోరవచ్చు. ఇలాంటి సందర్భాలలో తాము స్వయంగా కూడా సభ్యపేజీలో మార్పులు చేయడం కుదరదు. కాబట్టి సభ్యపేజీలకు పరిమిత కాలపు సంరక్షణ కల్పించడం/కల్పించుకోవడం ఉత్తమం.
కొందరి సభ్యపేజీలు | ||||||
|
| |||||
|
| |||||
రాజశేఖర్ | అర్జున్ రావు | |||||
| వెంకటరమణ |
No comments:
Post a Comment