తెలుగు వికీపీడియాకు సంబంధించి సెప్టెంబరు 2013 గణాంకాలు విడుదలైనాయి. ఈ గణాంకాల ప్రకారం పరిశీలీస్తే తెవికీ గణాంకాలు మెరుగుపడినట్లు తెలుస్తోంది. కారణం ఏమైనా సరే ముఖ్యంగా దిద్దుబాట్లు మాత్రం ఈ మాసంలో బాగా పెరిగినట్లు గణాంకాలు స్పష్టపరుస్తున్నాయి.
- సభ్యుల సంఖ్య 7 పెరిగి మొత్తం సభ్యుల సంఖ్య 599కి పెరిగింది (5+ దిద్దుబాట్లు చేసినవారు).
- ఈ మాసంలో 5కు పైగా దిద్దుబాట్లు చేసిన వారి సంఖ్య 48గా నమోదైనది. ఇది తెవికీ గణాంక చరిత్రలోనే రెండో అత్యధికం. ఫిబ్రవరి 2008లో ("ఈనాడు" వల్ల) నమోదైన 102 సంఖ్య తర్వాత ఇది రెండో స్థానంలో ఉంది.
- 9/2013 మాసంలో 100కు పైగా దిదుబాట్లు చేసినవారి సంఖ్య 12 ఉంది. 16 మరియు 13 తర్వాత ఈ సంఖ్య కూడా మూడో అత్యధికంగా చెప్పవచ్చు.
- ఈ మాసంలో రోజుకు సరాసరిన 18 కొత్త వ్యాసాలు తెవికీలో సృష్టించబడ్డాయి. 11/2011 తర్వాత మళ్ళీ ఈ సంఖ్య రావడం జరిగింది.
- సెప్టెంబరు 2013 మాసంలో 12వేల దిద్దుబాట్లు జరిగాయి. గత మాసంతో పోలిస్తే ఇది 55% వృద్ధిరేటు నమోదైంది.
- ఈ మాసంలో 100+ దిద్దుబాట్లు చేసిన వారు 12, 250+ దిద్దుబాట్లు చేసినవారు 7 సభ్యులుండగా, 1000+ దిద్దుబాట్లు చేసినవారు ముగ్గురున్నారు. ఇంతవరకు తెవికీలో నమోదవ్వని ఒకే సభ్యునిచే 2500+ దిద్దుబాట్లు ఈ మాసంలో కనిపించింది. (ఇవి వ్యాసంలోని దిద్దుబాట్లు మాత్రమే).
YVSREDDY | 2647 |
Kvr.lohith | 2216 |
Bhaskaranaidu | 1448 |
Rajasekhar1961 | 1179 |
శ్రీరామమూర్తి | 722 |
C.Chandra Kanth Rao | 291 |
Pranayraj1985 | 251 |
ఇతరులు | 3246 |
ఏ సభ్యుడు ఏమి చేశాడు? (వ్యాసంపేజీలలో 100+ దిద్దుబాటు చేసినవారు)
- YVSREDDY= పైపింగ్ పనులు, మండల వ్యాసాలలో మూసలు, మూసలలో అక్షరక్రమం,
- Kvr.lohith= కొత్త సభ్యులకు ఆహ్వానం, కొత్త వ్యాసాల సృష్టి మరియు విస్తరణ, వ్యాసాలకు వర్గాలు చేర్చుట, బొమ్మల అప్లోడ్, దారిమార్పులు,
- Bhaskaranaidu= బ్లాగులింకులు, బ్లాగుల నుంచి సమాచారం కాపీ, సంఖ్యానుగుణ వ్యాసాల సృష్టి (కాపి), బొమ్మల అప్లోడ్,
- Rajasekhar1961= కొత్త వ్యాసాల సృష్టి మరియు విస్తరణ, సభ్యపేజీలలో వర్గాల చేర్పు, ప్రాజెక్టు పనులు,
- శ్రీరామమూర్తి= గ్రామవ్యాసాలలో గణాంకాలు చేర్చుట
- C.Chandra Kanth Rao= బ్లాగులింకుల తొలగింపు, వర్గాల మార్పులు,
- Pranayraj1985= సినిమా పేజీల విస్తరణ, దారిమార్పులు,
- సుల్తాన్ ఖాదర్= జీవశాస్త్ర పేజీల విస్తరణ, కొత్త సభ్యులకు స్వాగతం,
- అహ్మద్ నిసార్= ఇస్లాం వ్యాసాలు, ప్రయోగశాల వినియోగం,
- Nrahamthulla= కొత్త వ్యాసాల సృష్టి, వ్యాసాల పొడగింపు,
- విశ్వనాధ్.బి.కె.= వ్యాసాల పొడగింపు, 5 కొత్త వ్యాసాల సృష్టి,
- Palagiri= నూనె సంబంధిత వ్యాసాల వృద్ధి, కొత్త సభ్యులకు ఆహ్వానం, అనవసర లింకుల తొలగింపు,
- T.sujatha= ఆస్టిన్, శ్రీలంక, మనీల వ్యాసాల పొడగింపు,
- Veera.sj= వర్గాల చేర్పులు, ప్రయోగశాల వినియోగం, ఫోటోగ్రఫి వ్యాసాలు,
గమనిక: గణాంకాలకు తెవికీ నాణ్యతకు ఎలాంటి సంబంధం ఉండదు. దిద్దుబాట్లు అధికసంఖ్యలో చేసిననూ వారు ఎలాంటి దిద్దుబాట్లు చేశారనేది ముఖ్యము. దిద్దుబాట్ల సంఖ్యతో నిమిత్తం లేకుండా నాణ్యమైన వ్యాసాన్ని రచించిన వారికే భవిష్యత్తులో ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. కాబట్టి సభ్యులు గణాంకాలపై కాకుండా తెవికీ నాణ్యతను దృష్టిలో ఉంచుకొని కృషిచేయడం మంచిది.
No comments:
Post a Comment