కొత్తవారు తెలుగు వికీపీడియాలో ప్రవేశించిన పిదప ఏమి వ్రాయాలి అనే విషయంలో సందేహపడుతుంటారు. ఏ విషయంపై వ్రాయాలి, అందులో ఎలాంటి సమాచారం ఉంచాలి అని తర్జనభర్జన పడుతుంటారు. అయితే తెవికీలో ఏమి వ్రాయాలనే విషయంలో ఎలాంటి నిర్భందాలు లేవు. మీరు ఏ విషయంపై నైనా వ్రాయవచ్చు, ఎలాంటి సమాచారంనైనా చేర్చవచ్చు అయితే దీనికి కొద్దిగా నియమాలు మాత్రం పాటించాల్సి ఉంటుంది. మరి ఆ నియమాలేమిటి, సమాచారం చేర్చడానికి పరిమితులేమిటి తెలుసుకుందాం.
గుండుసూది నుంచి టైటానిక్ వరకు, నీటిబొట్టు నుంచి మహాసముద్రం వరకు, నింగి నుంచి నేల వరకు ఉన్న ఏ సమాచారమైనా, ఏ వ్యక్తి గురించి నైనా, ఏ పదార్థం గురించి నైనా ఇలా మీకు తోచిన, కంటికి కనిపించిన, కనిపించని వస్తువుల గురించి కూడా నిర్భయంగా వ్రాయవచ్చు. భౌగోళిక, రాజకీయ, ఆర్థిక, జీవ, జంతు, భౌతిల, రసాయన శాస్త్రాల గురించి, క్రీడలు, వర్తమాన అంశాలు గురించే కాకుండా మీరు భుజించే ఆహరపదార్థాలు, కూరగాయల గురించి, మీరు రోజూ ఉపయోగించే వస్తువుల గురించి, మీ గ్రామం గురించి, మీకు తెలిసిన ప్రదేశాల గురించి... ఇలా ఏ అంశంపైనైనా, ఏ రంగంపై నైనా, ఏ వ్యక్తిపై నైనా వ్యాసాలు వ్రాయవచ్చు, ఉన్న వ్యాసాలను పొడగించవచ్చు.
పరిమితులు:

- వ్యాసాన్ని రచించేటప్పుడు ముఖ్యంగా గుర్తించుకోవాల్సినది సమాచారం ఎక్కడి నుంచి కాపీ చేయరాదనేది. వ్యాసంలో అక్కడక్కడా బయటి నుంచి తీసుకున్న వాక్యాలను చేర్చవచ్చు (దీనికి మూలాలు ఇవ్వాలి) కాని మక్కికిమక్కిగా ఎక్కడో లభ్యమైన సమాచారాన్ని తెవికీలో చేర్చరాదు. అలాచేరిస్తే ఎవరైనా నిర్వాహకులు కాపిహక్కులు ఉల్లంఘించినట్లు గమనించిన వెంటనే సమాచారం తొలిగిస్తారు కాబట్టి బయటి సమాచారాన్ని యధాతథంగా చేర్చకండి.
- వ్యాసంలో స్వంత అభిప్రాయాలు ఉండనట్లు చూసుకోండి. తెవికీలో రచించే ఏ వ్యాసమైననూ, వ్యాస సమాచారమైననూ మన అభిప్రాయాలుగా ఉండరాదు. కాబట్టి మనకు తోచిన విధంగా,మన అభిప్రాయాలు జోడిస్తూ రచించడం జరుగరాదు.
- తెవికీలో వ్యాసం తెలుగులోనే వ్రాయాలి. తెలుగు కాకుండా ఇతరభాషలలో రచించిన సమాచారాన్ని తొలగించడం జరుగుతుంది. అలాగే ఇతర భాషావికీలలో ఉన్న సమాచారం కూడా కాపీపేస్ట్ చేయకండి, వీలయితే దాన్ని అనువాదం చేసి చేర్చండి.
- ఏ వ్యక్తిపైనైనా వ్యాసం ఉండవచ్చని భావించి మీ వ్యక్తిగత సమాచారంతో వ్యాసం సృష్టించకండి. స్వయంగా తమగురించి చేర్చబడిన సమాచారం వెంటనే తొలగించబడుతుంది. మీ గురించి సంక్షిప్తంగా మీ సభ్యపేజీలో (అక్కౌంటు సృష్టించుకుంటేనే) వ్రాసుకోవచ్చు.
- మీరు వ్రాసే వ్యాసాలలో ప్రధాన వాక్యాలకు మూలాలను పేర్కొనండి. మూలాలు లేని వ్యాసాలు తొలగింపునకు గురికావచ్చు.
- మీరు సృష్టించే వ్యాసం అతిచిన్నగా ఉన్ననూ తొలిగించబడుతుంది. దాన్ని కనీసం 2 కిలోబైట్ల పరిమాణం వరకు పెంచడానికి వీలవుతుందేమో చూడండి. అలా వీలుకాకుంటే ప్రత్యేక వ్యాసంగా కాకుండా ఏదో సంబంధిత సమాచారం ఉన్న వ్యాసంలో ఒక విభాగంగా చేర్చడానికి ప్రయత్నించండి.
No comments:
Post a Comment