Sunday, 12 January 2014

తెలుగు వికీపీడియాలో "తెలంగాణ ప్రాజెక్టు" ప్రారంభం

జనవరి 11, 2014 నాడు తెలుగు వికీపీడియాలో "తెలంగాణ ప్రాజెక్టు" ప్రారంభించబడింది. కొద్దిరోజుల క్రితమే తెలంగాణ పోర్టల్ ప్రారంభం కాగా ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రాజెక్టు ప్రారంభమైనదని తెలియజేయుటకు సంతోషిస్తున్నాను. తెలంగాణకు చెందిన 10 జిల్లాలలోని గ్రామాలు, మండలాలు, జిల్లా వ్యాసాలు, ప్రముఖులు, పర్యాటక ప్రాంతాలు, నియోజకవర్గాలు, చారిత్రక కట్టడాలు, సంస్థానాలు, రైల్వేస్టేషన్లు తదితర వ్యాసాల పరిస్థితి మరియు కొత్తగా చేరిన వ్యాసాలు, కృషిచేస్తున్న సభ్యులు తదితర సమాచారం ఈ ప్రాజెక్టు ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవడమే కాకుండా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వ్యాసాల అభివృద్ధికి, ఈ ప్రాజెక్టులో కృషిచేస్తున్న సభ్యులకు తగిన గుర్తింపు ఇవ్వడానికి ఇది దోహడపడుతుంది. ఈ ప్రాజెక్టు విషయంలో మరిన్ని సలహాలు, సూచనలకు సదా ఆహ్వానం. ఈ ప్రాజెక్టులో ఎవరైననూ ఏ అంశంపైన అయిననూ తమకు తెలిసిన విషయాలను చేర్చవచ్చు, తాము తీసిన బొమ్మలను అప్లోడ్ చేయవచ్చు, ఉన్న వ్యాసాలలో మార్పుచేర్పులు చేసి నాణ్యత పెంచవచ్చు, తాజాకరణ చేయవచ్చు. ఈ ప్రాజెక్టులో కృషిచేసే వారి గురించి ఎప్పటికప్పుడు సమాచారం పోందవచ్చు.

No comments:

Post a Comment