Wednesday, 8 January 2014

తెవికీ నవంబరు 2013 మాసపు గణాంకాలు

తెలుగు వికీపీడియాలో నవంబరు 2013లో కొత్తగా 5గురు సభ్యులు (5+ దిద్దుబాట్లు చేసినవారు) చేరారు. దీనితో మొత్తం సభ్యుల సంఖ్య 613కు చేరింది. ఈ మాసంలో 5+ దిదుబాట్లుచేసిన సభ్యుల సంఖ్య 37 కాగా, 100+ దిద్దుబాట్లు చేసిన వారు 13. 100 కంటె అధికంగా దిద్దుబాట్లు చేసినవారు ఒక మాసంలో రెండంకెలు ఉండటం ఇది వరసగా నాలుగవ సారి. ఇది తెవికీ చరిత్రలోనే రికార్డు. ఈ మాసంలో రోజుకు సరాసరిన 13 కొత్త వ్యాసాలు సృష్టించబడ్డాయి. 11/2013లో దాదాపు 13వేల దిద్దుబాట్లు జరిగాయి.సభ్యుల వారీగా దిద్దుబాట్ల సంఖ్య చూస్తే ఈ మాసం కూడా సభ్యుడు YVSREDDY 3,437 దిద్దుబాట్లతో తొలిస్థానంలో నిలిచారు. సభ్యుడు శ్రీరామమూర్తి 2,264 దిద్దుబాట్లతో రెండోస్థానంలో ఉన్నారు. వీరిద్దరూ తెవికీ దిద్దుబాట్ల ర్యాంకింగులో ఒక్కో ర్యాంకు పైకెక్కి 5, 10వ స్థానాలకు చేరారు. నేను (C.Chandra Kanth Rao) 1,046 దిద్దుబాట్లతో 3వ స్థానంలో, T.sujatha (786), Palagiri (720), Rajasekhar1961 (643) తర్వాతి స్థానాలలో నిలిచారు.

No comments:

Post a Comment